• Mana Telugu Kathalu - Admin

పోటీలు - బహుమతులు


'Potilu - Bahumathulu Published By Admin,

Mana Telugu Kathalu

గౌరవనీయులైన రచయితలకు, పాఠకులకు మా నమస్సుమాంజలులు.

మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ ఇస్తున్నాము.



https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఈ లింక్ ను మీ మిత్రులకు, అభిమానులకు షేర్ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యమని కోరండి.


మన యూ ట్యూబ్ ఛానల్ లోకి ప్రయోగాత్మకంగా కొన్ని కథలను అప్లోడ్ చేశాము.

మీ సూచనలు, సలహాలు, ఆశీస్సులతో ఈ ఛానల్ ను మరింత ముందుకు తీసుకొని వెళ్లగలమని ఆశిస్తున్నాము.

మనతెలుగుకథలు.కామ్ వారి చేత పోడ్ కాస్ట్ చెయ్యబడ్డ మరియు యూ ట్యూబ్ కి అప్లోడ్ చెయ్యబడ్డ కథల నుండి ఎక్కువ జనాదరణ పొందిన కథలకు బహుమతులు ప్రకటించాలని భావిస్తున్నాము. ఇందుకు సంబంధించిన పోస్ట్ ను మనతెలుగుకథలు.కామ్ లో 15/12/2021 న ప్రచురిస్తాము.

16/10/2021 నుండి పోడ్ కాస్ట్ చెయ్యబడ్డ మరియు యూ ట్యూబ్ కి అప్లోడ్ చెయ్యబడ్డ కథలన్నీ ఈ పోటీలకు పరిగణింపబడుతాయి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది కథల పోటీ, నాన్ స్టాప్ కథల పోటీ, జోక్స్ పోటీ, పాఠకులకు బహుమతులు మొదలైన వివరాలు ఇదివరకే తెలియజేశాము. ఆ పోస్ట్ చూడని వారి కోసం ఆ వివరాలు ఇక్కడ మళ్ళీ పొందు పరుస్తున్నాము.


విషయ సూచిక :

1 . ఉగాది కథల పోటీ

2 . రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం

3 . NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

4 . నవ్వించండి - జోకుల పోటీలు

5 . పాఠకులకు బహుమతులు

6 . మరిన్ని ముచ్చట్లు

1 . ఉగాది కథల పోటీ

సంక్రాంతి 2021 మరియు విజయదశమి 2021 పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగం లో ఇప్పటి వరకు దాదాపు 60 మందికి పైగా రచయితలకు/రచయిత్రులకు గౌరవ పారితోషకం తో పాటు E - ప్రశంసా పత్రాలు అందజేశాము.

ఇప్పుడు ఉగాది 2022 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

ఉగాది 2022 బహుమతుల వివరాలు :

ప్రథమ బహుమతి రూ: 5000 /-

ద్వితీయ బహుమతి రూ: 2000 /-

తృతీయ బహుమతి రూ: 1000 /-

ప్రత్యేక ప్రథమ బహుమతి రూ: 1000 /-

( కేవలం నూతన రచయితలకు)

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి. నూతన రచయితల కథలు కూడా ముందుగా మెయిన్ విభాగంలో పరిశీలింప బడతాయి. అందులో ఎంపిక కాకపోతే ప్రత్యేక ప్రథమ బహుమతికి పరిశీలింపబడతాయి.

నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఐదు, లేదా అంతకంటే తక్కువ కథలు ప్రచురింపబడ్డవారు నూతన రచయితలుగా పరిగణింపబడతారు..

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.

*వెంటనే మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 20 /03 /2022

*ఫలితాలు 03 /04 /2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

*NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగంలో ఎంపికైన కథలు మాత్రమే ఉగాది బహుమతులకు అర్హమవుతాయి.

బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.

2 . రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం

మాకు రెగ్యులర్ గా కథలు పంపిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ, పాఠకులను అలరిస్తూ ఉన్న మా అభిమాన రచయితలను సన్మానించి, సత్కరించాలని భావిస్తున్నాము.

నిబంధనలు/ఇతర వివరాలు

*16 /10 /2021 నుండి 20 /03 /2022 మధ్య కాలంలో మనతెలుగుకథలు.కామ్ లో కనీసం 10 రచనలైనా ప్రచురింపబడి ఉండాలి.

*ఉగాది కథల పోటీలో బహుమతులు పొంది ఉండాలన్న నిబంధన లేదు.

*క్రింద ఇవ్వబడ్డ బిరుదుల్లో మీకు ఇష్టమైన రెండు బిరుదులను ఎంచుకోండి.

*ఒకే విభాగానికి పోటీ ఏర్పడినప్పుడు న్యాయ నిర్ణేతల అభిప్రాయం ప్రకారం ఆయా రచయితలను సంప్రదించి నిర్ణయం తీసుకొనబడుతుంది.

*ఈ బిరుదు ప్రదానం/సన్మాన కార్యక్రమం లో ఏ విధమైన నగదు బహుమతి ఇవ్వబడదు.

*రచయితలను సన్మానించి, బిరుదు బహూకరించిన సర్టిఫికెట్ ఇచ్చి, జ్ఞాపిక (మొమెంటో) ఇవ్వబడుతుంది.

*అలాగే మీ వద్ద నుండి ఏ విధమైన చందా వసూలు చేయబడదు.

*మనతెలుగు.కామ్ రచయితలను ఒకే వేదిక పైకి తీసుకొని రావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

*ఈ క్రింది వాటిలో రెండు బిరుదులు ఎంపిక చేసుకొని, వీలు చూసుకొని story @manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

1 . ఉత్తమ రచయిత 2022

2 . ఉత్తమ రచయిత్రి 2022

3 . ఉత్తమ అభ్యుదయ రచయిత 2022

4 . ఉత్తమ అభ్యుదయ రచయిత్రి 2022

5 . ఉత్తమ నవతరం రచయిత 2022

6 . ఉత్తమ నవతరం రచయిత్రి 2022

7 . ఉత్తమ ఆధునిక రచయిత 2022

8 . ఉత్తమ ఆధునిక రచయిత్రి 2022

9 . ఉత్తమ ఈ తరం రచయిత 2022

10 . ఉత్తమ ఈ తరం రచయిత్రి 2022

11 . ఉత్తమ సీనియర్ రచయిత 2022

12 . ఉత్తమ సీనియర్ రచయిత్రి 2022

13 . మెగా రైటర్ (మేల్ ) 2022

14 . మెగా రైటర్ (ఫిమేల్ ) 2022

*సన్మాన కార్యక్రమం ఏప్రిల్ 2022 చివరివారంలో హైదరాబాద్/నెల్లూరు లలో ఆయా రచయితలను సంప్రదించి ఏర్పాటు చేయడం జరుగుతుంది.

*కార్యక్రమం, అప్పటి కోవిడ్ నిబంధనలను అనుసరించి ఉంటుంది.

*రచయితలు ఈ కార్యక్రమం లో మార్పులు సూచించవచ్చును.

3 . NON STOP PRIZES ( వారం వారం బహుమతులు )

రచయితల, పాఠకుల ఆదరణ పొంది, ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 20 /03 /2022 వరకు పొడిగించాలని నిర్ణయించాము. ఇందులో ఎంపికైన కథలు మాత్రమే ఉగాది కథల పోటీకి అర్హమవుతాయి.

16 /10 /2021 నుండి 30 /11 /2021 వరకు ప్రచురింపబడ్డ కథల నుండి ఎంపిక కాబడ్డ కథల వివరాలు 15 /12 /2021 న ప్రచురింపబడతాయి.

తరువాత ఎప్పటిలా ప్రతినెలా 15 వ తేదీ ఫలితాల ప్రకటన ఉంటుంది.

4 . నవ్వించండి - జోకుల పోటీలు

మనతెలుగుకథలు.కామ్ లో 'జోకులు' విభాగాన్ని ప్రారంభించాము.

ప్రతినెలా పది లేక అంతకంటే ఎక్కువ జోకులు ప్రచురింప బడ్డ వారి నుండి ( ఒక్కసారిగా గానీ, విడి విడిగా గానీ ) ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 116 /- బహుకరిస్తాము.

20 /03 /2022 నాటికి ఎక్కువ జోకులు ప్రచురింప బడ్డవారికి 1116 /- బహూకరిస్తాము.

జోక్స్ ప్రచురించినట్లుగా ఇంటిమేషన్ ఇవ్వడం సాధ్యం కాదు.

మీ జోకుల్ని https://www.manatelugukathalu.com/post/jokes-1-telugu-jokes విసిట్ చేసి ప్రచురింపబడ్డదీ, లేనిదీ తెలుసుకోవచ్చు.

ఈ విషయంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడవు.

సాధారణంగా జోక్స్ ని మూడు రోజుల్లోగా ప్రచురిస్తాము.

అన్ని జోక్స్ నూ ఒకే పోస్ట్ లో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.

పాఠకుల ఆదరణ లేకపోతే ఈ పోటీ నిలిపివేయ బడుతుంది.

5 . పాఠకులకు బహుమతులు

మనతెలుగుకథలు.కామ్ ని రెగ్యులర్ గా విసిట్ చేస్తున్న పాఠకులకు బహుమతులు అందించాలని నిర్ణయించుకున్నాము.

ప్రతి నెల 5 లేదా అంతకంటే ఎక్కువ కథల పైన సమీక్షలు రాసిన వారినుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి వారికి Rs 116 /- పారితోషకంగా అందించబడుతుంది.

20 /03 /2022 నాటికి ఎక్కువ సమీక్షలు ప్రచురింప బడ్డవారికి 1116 /- బహూకరిస్తాము.

కేవలం బహుమతుల కోసం పంపే సమీక్షలు పరిగణింప బడవు.

6 . మరిన్ని ముచ్చట్లు

ప్రతి రచయితకు వారి కథల తాలూకు లింక్ లను మెయిల్ ద్వారా, వాట్స్ అప్ ద్వారా పంపుతున్నాము. కానీ కొంతమంది రచయితలు ఆ లింక్ లను ఎవరికీ షేర్ చెయ్యక పోవడం వలన తక్కువ మంది మాత్రమే వారి కథలను చదువుతున్నారు.

మంచి కథ వ్రాయడమే కాదు. ఆ కథ ఎక్కువ మంది చదివేలా అందరం ప్రయత్నించాలి. అలాగే మీ కథలకు కామెంట్ చెయ్యడం, లైక్స్ పెట్టడం తెలియని వారికి నేర్పించండి.

మరి కొంతమంది ఇతరుల రచనలను అసలు టచ్ చేయడం లేదు. తోటి రచయితల రచనలను చదివి ప్రోత్సహించండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ధన్యవాదాలు.


మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం



9 views0 comments